Rajinikanth to visit Himalayas

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు వుండడేమో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మహోన్నత స్తానం ఆయనది. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ చిత్ర పరిశ్రమలే కాక, ఉత్తరాదిన హిందీ చిత్ర పరిశ్రమలో కూడా మంచి గుర్తింపును పొందారు. ప్రస్తుతం ఆయన రోబొ 2.0, కాలా చిత్రాలతో బిజీగా వున్నారు. కాల చిత్రం 27 ఏప్రిల్ 2018 విడుదలకు సిద్దంగా వున్నారు.

రజినికాంత్ వీలు చిక్కినప్పుడల్లా ఆద్య్యత్మికం వైపు దృష్టి సారిస్తారు. అందులో భగంగానే హిమాలయాలకు వెళ్లి వస్తుంటారు. ఇప్పుడు రజినీకాంత్ మరోసారి హిమాలయాలకు వెళ్లనున్నారు. మార్చి 10న రజినీ హిమాలయాలకు బయల్దేరనున్నారు. తన ఆద్య్యత్మిక గురువు మహావతార్ బాబాజీ ఉపదేశించినట్లుగా వారం రోజులపాటు అక్కడే ఉండి ధ్యానంలో నిమగ్నులవుతారు. ఆయన అత్యంత పవిత్రంగా భావించే ఈ ప్రదేశాన్ని తరచుగా సందర్శిస్తుంటారు. బాబాజీ దర్శనమిచ్చారని భావించే ప్రదేశంలో రజినీకాంత్ ధ్యానం చేసుకుంటారు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు రజినీ ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.

ఋఅజినికాంత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నరు అందుకుగాను త్వరలో ఆయన రాజకీయ పార్టీ పేరు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ యాత్ర అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రజినీ తమిళనాట ఆధ్యాత్మిక రాజకీయాలకు శ్రీకారం చుడతానని ఇటీవలే ప్రకటించారు. తనకు రాజకీయాల్లో అవకాశమిస్తే ఎంజీఆర్ పాలననను తలపిస్తానని ప్రకటీచారు.

శనివారం నాడు చెన్నై విమాశ్రయం నుంచి బయలుదేరి తలైవా సిమ్లా చేరుకుంటారు. అనంతరం అక్కడి నుండి రిషికేష్, ధర్మశాల మొదలైన పుణ్యక్షేతాలను సందర్శించి అక్కడ ఆధ్యాత్మిక గురువుల ఆశీర్వాదాలను తీసుకుని.. రాజకీయ పరమైన సూచనలు, సలహాలు రజినీ వారి నుండి అందుకోనున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *