‘బాహుబలి’ రికార్డ్స్ బద్దలు కొట్టినా అమీర్ ఖాన్...!

బాహుబలి 2 మూవీ భారతీయ చాలనా చిత్ర చరిత్రాల్లో ఓకా చెరిగోపిని ఆద్యయని తిరగరస్సిన సినిమా, కాని ఇప్పుడే అ రిక్కర్డు లాని మారో భారతీయ సినిమా థిగగా రాసినది ఆది మరే సినిమానొ కాడు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ దంగల్ సినిమా. భారతీయ సినీ పరిశ్రమలో ఆమిర్ ఖాన్‌ రికార్డ్స్‌ను బీట్ చేయడం ఇక ఎవరికీ సాధ్యం కాదేమో. ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ మూవీ సరికొత్త మైలురాయిని చేరుకుంది. ప్రపంచ సినిమా చరిత్రలో టాప్ 5 మూవీస్‌లో చోటు దక్కించుకుంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన దంగల్.. అధికారికంగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 300 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించింది. భారత కరెన్సీలో రూ. 1930 కోట్లు అనమాట. ఇంతపెద్ద మొత్తంలో కలెక్షన్లు సాధించిన నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో దంగల్ ఐదవ స్థానంలో నిలిచి భారత సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.

అధికారిక సమాచారం ప్రకారం.. స్పోర్ట్స్ బయోపిక్ నేపథ్యంతో తెరకెక్కిన దంగల్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 301 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టింది. ఇటీవల చైనాలో విడుదలై సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా చైనాలో ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రం సాధించని విధంగా 179.8 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ వచ్చాయి. స్వదేశంలో 84.4 మిలియన్ డాలర్లు వచ్చాయి.

ఇంతపెద్ద మొత్తంలో కలెక్షన్లు రాబట్టిన దంగల్ నాన్ ఇంగ్లీష్ మూవీస్ టాప్ లిస్ట్‌లో 5వ స్థానంలో నిలిచింది. మొదటి నాలుగు సినిమాల్లో చైనాకు చెందిన ‘ది మెర్మేడ్‘(533 మిలియన్ డాలర్లు), ‘మోన్‌స్టర్ హంట్’-386 డాలర్లు, ఫ్రాన్స్ దేశానికి చెందిన ‘ది ఇన్‌టచ్‌బుల్స్’-427 డాలర్లు, జపాన్‌కు చెందిన ‘యువర్ నేమ్’-354 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో టాప్ 4లో ఉండగా, ఇప్పుడు ఇండియా నుంచి దంగల్-301 మిలియన్ డాలర్లతో ఐదవ స్థానంలో నిలిచింది. కాగా బాహుబలి-2 సినిమా 1500 కోట్లకు పైగా కలెక్షను సాధించిన రెండవ భారతీయ చిత్రంగా నిలిచింది.

మల్లయోధుడు మహవీర్ సింగ్ పోగత్ జీవిత కథాంశం ఆధారంగా తెరకెక్కిన దంగల్.. దేశ చరిత్రలోనే ఓవర్‌సీస్‌లో 100 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించిన ఏకైక భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *