X

టిడిపిపై, చంద్రబాబుపై నమ్మకం కోల్పోతున్నా: పవన్

 

ప్రముఖ సినీ నటుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఏపిలొ రాష్త్ర ప్రభుత్వంగా కొనసాగుతున్న తెలుగు దేశం పార్టీ పై తనకు నమ్మకం పోతోందని అన్నారు. తెలుగు రాష్త్రాల్లొ ఒకటైన ఏపిపై అవినీతిమయ రాష్త్రంగా ఆరోపణలు రావడం తనకు భాద కలిగించిందని అన్నారు. ఇప్పతి వరకు తెదెపా ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదన్నారు. మరో పక్క ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు గందరగోళ పరుస్తున్నాయని విమర్శించారు.

విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్త్రానికి సరైన న్యాయం చేయకపోవడం వల్ల ఏపీకి సంబంధించిన సమస్యలు విన్నవించడానికి గతంలో ప్రధాని మంత్రి అయిన మోదీని కలవాల్సి వచ్చిందన్నారు. ఆనాడు ప్రధాని మంత్రి మోదీ ఆంధ్ర రాష్త్రానికి సరైన న్యాయం చేస్తారని నమ్మబట్టే ఆయన్ని కలిశానని అందుకే ఇన్నాళ్లు సంయమనం పాటించానని.. రాష్త్రానికి తప్పక న్యాయం జరుగుతుందని అనుకున్నానని తెలిపారు. ఆంధ్ర ఫ్రదెశ్ అభివ్రుద్ధి విషయలో దేన్నైతే మేనిఫెస్టోలో పెట్టారో దాన్నే బీజేపీ పక్కకు పెట్టిందని విమర్శించారు.

జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత తిరుపతి, కాకినాడలలో జనసేన సభలు పెట్టిన సమయలో కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందన్నారు. అప్పుడు బాబు కూడా దానికి మద్దతు పలికారన్నారు. ప్యాకేజీపై కూడా ఎవరూ స్పష్టత ఇవ్వలేదన్నారు. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ రాకపోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రత్యేక ప్యాకేజీకి మద్దతు తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ పై ఎవ్వరికీ స్పష్టత లేదు. ఒకసారి బాగుందంటారని.. మరోసారి బాగోలేదంటారని అన్నారు. ఏపీ ప్రజలను కేంద్రంలో బి.జె.పి, రాష్త్రంలో టి.డి.పి ప్రభుత్వాలు గందరగోళంలో పడేస్తోందన్నారు. రాష్ట్రం, కేంద్రం నుంచి భిన్న వాదనలు వస్తున్నాయన్నారు. ఇప్పటికైనా ఏపిలొ రాష్త్ర ప్రభుత్వం, పార్లమెంట్లో యం.పీలుకేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కచ్చితంగా జేఏసీ ఉండాలని పవన్ అభిలషించారు.