Bhagamathi collections

సినిమా ప్రేక్షకుల నాడిని టచ్ చేయడం అంటే మాములు విషయం కాదు దానికి ఎంతో నేర్పు కావాలి. దానికి తోడు ప్రేక్షకుల అభిరుచిని గ్రహించగలిగే తెలివి, నైపుణ్యం వుందాలి అటువంటి దర్శకులు ఎంతో మంది వున్నారు. ఆ కోవకి చెందిన దర్శకులు ఎంతో మంది ఉన్నా ఈతరంలో శంకర్, రాజమౌళి, త్రివిక్రం శ్రీనివాస్, రాజ్ కూమార్ హిరాణీలు భారతీయ చిత్ర పరిశ్రమని శాసిస్తున్న వారు.

ఆందుకే ప్రేక్షకులు వీరి సినిమాలకు బ్రహ్మ రథం పడతారు. వీరిని అమితంగా ఆరాధిస్తారు. కాని ఈతరం ప్రేక్షకుల్లొ ఎంతో వైవిద్యం కనిపిస్తుంది. కొత్త కధ, కధనాలతో ముందుకు వచ్చే దర్శకులను కూడ ఆదరిస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఎన్నో చిత్రాలు, ఎంతో మంది దర్శకులను అద్భుత విజయాలు అందుకున్నారు.

ఆ కోవలోనే విడుధలైన చిత్రం ‘భాగమతీ. ఆ చిత్ర దర్శకుడు జి.అశొక్. కధ, కధనాలు కొత్తగా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నిరూపించారు. భాగమతిగా అనుష్క నటనకు బ్రహ్మ రథం పడుతున్నారు. ఆందుకు ఆ చిత్రం సాదిస్తున్న కల్లెక్షన్లే నిదర్శనం. స్టార్ హీరోల సినిమాలో చిన్న తేడా అనిపించినా ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్న ట్రెండ్ లో ఒక హీరొయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అందులోనూ తాను తప్ప మిగిలిన కీలక తారాగణమంతా పర బాషా నటులు ఉన్న మూవీతో అనుష్క భారీ వసూళ్లు దక్కించుకుని తన మార్కెట్ ఏ స్థాయిలో ఉందో మరోసారి చాటి చెప్పింది.

మొదటి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగు పెట్టిన భాగమతి ఇంకా దూసుకుపోతునే ఉంది. ట్రేడ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు సుమారు 40 కోట్ల దాకా గ్రాస్ తో 21 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది.ఏ లెక్కలో చూసుకున్నా హీరో లేని సినిమాకి ఇది పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. కొత్తగా వచ్చిన సినిమాలు తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం అంతగా లేదు అనే రిపోర్ట్స్ ఉన్నాయి.  బ్రేక్ ఈవెన్ చేరుకున్న భాగమతి అనుష్క ఇమేజ్ మార్కెట్ లో ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంత బలంగా ఉందో ఋజువు చేసింది. హారర్ జానర్ మూవీకి ఇంత రావడం అంటే విశేషమే. వారం దాకా ట్రెండ్ ఇలాగే కొనసాగితే భాగమతి భారీ హిట్ గా మిగులుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *