Coronavirus Killing Medicine is in our hands

కరోనా వైరస్ అనేది జీవి కాదు. కొవ్వు కణాలతో ఆవరించబడివున్న ఒక ప్రోటీన్ అణువు (RNA) మాత్రమే. ఇది ఒక నిర్జీవి. ఇది కంటి, ముక్కు,గొంతు లోని కణాలతో కలిసినప్పుడు తన యొక్క జన్యు కోడ్(RNA) ను మార్చుకొని, ఆ కణాలను చైతన్య వంతమైనవిగా చేయడమే కాక అవి సంఖ్యలో వృద్ధి అయ్యేవిధంగా చేస్తుంది.

వైరస్ అనేది జీవి కాదు కాబట్టి, దీనిని చంపడం అనేది జరుగదు. దానంతట అదే క్షయమవుతుంది ( నాశనం). వైరస్ క్షయం (నాశనం) అయ్యే సమయం ఉష్ణోగ్రత, గాలిలో తేమ & అది ఉన్న ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది.

వాస్తవానికి వైరస్ చాలా బలహీనమైనది. తేలికగా విచ్చిన్నమయ్యే గుణం కలిగినది. కానీ దానికి రక్షణ కవచంగా ఉన్న కొవ్వు కణాల వలన అది బలం సంతరించుకుంటుంది.

అందుకే సబ్బు, డిటర్జెంట్స్ వాడటం వలన, వాటినుండి వచ్చే నురగ కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది. అందుకే సబ్బు తదితర పదార్థాలతో కనీసం 30 సెకండ్లు గట్టిగా రుద్దమని చెబుతారు. సబ్బుతో రుద్దడం వలన కొవ్వు కణాలు విచ్చిన్నమై, లోపలవున్న వైరస్ ( ప్రోటీన్) కూడా దానంతట అదే విచ్చన్నమౌతుంది.

వేడి కొవ్వును కరిగిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అందుకే 25 డిగ్రీల కంటే ఎక్కువ వేడి వున్న నీటితో చేతులు, బట్టలు, ఇతరాలను శుభ్రపరచుకోవాలి.

వేడి నీటికి ఎక్కువ నురగ నిచ్చే లక్షణం కూడా ఉన్నది. నురగ ఎంత ఎక్కువగా ఉంటే, వైరస్ ను అంత సులభంగా కరిగించగలం.

కొవ్వులు ఆల్కహాల్‌ లో కరుగుతాయి. అందుకే 65% తగ్గని ఆల్కహాల్ లేదా ఆల్కహాల్‌ మిశ్రమాలు ఉపయోగించడం ద్వారా వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.

ఒకవంతు బ్లీచింగ్ పౌడర్, 5 వంతుల నీరు కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించినట్లయితే వైరస్ లోని ప్రోటీన్ అణువులను విచ్ఛిన్నం చేసి, వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.

హైడ్రోజన్ పెరాక్సైడ్ కు ప్రోటీన్ ( వైరస్) అణువులను విచ్చిన్నం చేసే శక్తి ఉన్నది. అందుకే చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్స్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగిస్తారు.

వైరస్ నిర్జీవి కనుక దానిని Anti Biotics నిర్వీర్యం చేయలేవు. కానీ వాటి నిర్మాణాన్ని కొంతమేరకు కుదించగలవు. Anti Biotics బాక్టీరియాను మాత్రమే చంపగలవు.

ఉపయోగించిన లేదా ఉపయోగించని బట్టలను దులపడం లేదా విదిలించడం చేయరాదు. ఎందుకంటే వాటిలో వైరస్ ఉంటుంది కాబట్టి.

వైరస్ నిర్వీర్యం కాకుండా/ నిలచి వుండే సమయం:
వైరస్ బట్టలపై – 3 గంటల వరకూ
సహజసిద్ధమైన ఏంటిసెప్టిక్ అయిన రాగిపై – 4 గంటలు
చెక్కపై – 4 గంటలు
కార్డ్ బోర్డు పై – 24 గంటలు
లోహాలపై – 42 గంటలు
ప్లాస్టిక్ పై – 72 గంటలు నిర్వీర్యం కాకుండా ఉంటుంది.

వైరస్ ఉన్న బట్టలు, ఇతరాలను మనం దులిపినపుడు వైరస్ గాలిలో కలసి సుమారు మూడుగంటలు ఉండే అవకాశం ఉంది. అటువంటి గాలిని మనం పీల్చినప్పుడు వైరస్ మన ముక్కు ద్వారా ఊపిరితిత్తుల లోనికి ప్రవేశిస్తుంది.

వైరస్ లు చల్లని వాతావరణం లో, ఎయిర్ కండిషనర్ల కారణంగా ఏర్పడే కృత్రిమ చల్లదనంలో మరియు చీకటిలో వాటి అస్తిత్వాన్ని నిలకడగా కొనసాగిస్తాయి.

కావున మన పరిసరాలను తేమలేకుండా, పొడిగా, వెచ్చగా, వెలుతురు తో వుండేలా చూసుకోవాలి.

ప్రతిరోజు గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.

అల్ట్రా వయొలెట్ కిరణాలు కూడా వైరస్ లోని ప్రోటీన్ లను విచ్చిన్నం చేస్తాయి. కానీ UV Rays చర్మంపై పడితే ( మన చర్మం లోని కొలాజిన్ అనే ప్రోటీన్ ను విచ్చిన్నం చేస్తాయి) చర్మ కేన్సర్ వచ్చే అవకాశం వుంటుంది.

ఆరోగ్య వంతమైన మానవవుని చర్మం ద్వారా ఈ వైరస్ లు శరీరం లోకి ప్రవేశించలేవు.

వెనిగర్ వలన ఉపయోగంలేదు ఎందుకంటే వెనిగర్ కు కొవ్వు లను కరిగించే శక్తి లేదు.

స్పిరిట్, వోడ్కా లవలన కూడా వైరస్‌ను కట్టడి చేయలేం ఎందుకంటే వాటిలో 40% కన్నా తక్కువ ఆల్కహాల్ ఉంటుంది. వైరస్ నిర్వీర్యం కావాలంటే 65% ఆల్కహాల్ కావాలి.

65% ఆల్కహాల్ కలిగిన శానిటీజర్స్, లిస్టరిన్ వలన కొంత ఉపయోగం ఉంటుంది.

తక్కువ వెలుతురు, గాలి కలిగిన ప్రదేశంలో, తక్కువ ఏరియాలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది.

విశాలమైన ప్రదేశం, గాలి, వెలుతురు ధారాళంగా ఉంటే వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది.

చేతులు ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎండిన చేతుల్లోని పగుళ్ళలో వైరస్ దాక్కొనే అవకాశం ఉంటుంది.

మనం ఉపయోగించే మాయిస్చరైజర్ ఎంత చిక్కగా ఉంటే వైరస్ ను విచ్చిన్నం చేయడానికి అంతగా ఉపయోగపడుతుంది.

గోళ్ళ సందుల్లో వైరస్ ఉండకుండా గోళ్ళ పరిమాణం చాలా తక్కువ వుండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే.

Note:

ఇనుముపై 12 గం. ల వరకూ వుంటుంది – కాబట్టి తాళాలు, తలుపుల నాబ్స్, స్విచ్ లు, రిమోట్స్, సెల్ ఫోన్, వాచీలు, కంప్యూటర్ లు, డెస్కులు, టివిలు ముట్టుకున్నప్పుడు, బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు, బయటి నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు, భోజనానికి ముందు తప్పక చేతులు సబ్బులు ఉపయోగించి 10 ని.ల కు తగ్గకుండా శుభ్రం చేసుకోవాలి.

మనకు కరోనావైరస్ సోకిందని తెలుసుకోవడం ఎలా?

  1. గొంతులో దురద,
  2. పొడి గొంతు,
  3. పొడి దగ్గు.
  4. జలుబు, తలనొప్పి నుండి తీవ్ర జ్వరము కూడా వస్తుంది. కావున మీరు ఈ మూడు లక్షణాలు మనకు వున్నాయేమో మనకు మనమే గమనించుకుంటూ ఉండాలి. ప్రతిరోజు గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.

ఎళ్ళవేళలా ముఖానికి మాస్కును ధరించండి. చేతులను శుభ్రంగా కడుక్కొండి. ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహనని పెంచుదాం.

Summary
కరోనాని నిర్మూలించే మందు మన చేతుల్లోనే వుంది!
Article Name
కరోనాని నిర్మూలించే మందు మన చేతుల్లోనే వుంది!
Description
కరోనా వైరస్ అనేది జీవి కాదు. కొవ్వు కణాలతో ఆవరించబడివున్న ఒక ప్రోటీన్ అణువు (RNA) మాత్రమే. ఇది ఒక నిర్జీవి. ఇది కంటి, ముక్కు,గొంతు లోని కణాలతో కలిసినప్పుడు తన యొక్క జన్యు కోడ్(RNA) ను మార్చుకొని, ఆ కణాలను చైతన్య వంతమైనవిగా చేయడమే కాక అవి సంఖ్యలో వృద్ధి అయ్యేవిధంగా చేస్తుంది.
Author
Publisher Name
Amaravathi News Times - Telugu
Publisher Logo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *