
మనం బాగా బతుకుతున్నాం కదా పక్క వారి గురించి మనకెందుకు అనుకునే ఈరోజుల్లో, అన్నదమ్ములు, అయినవారు, బందువుల గురించి ఆలోచించని ఈ కాలంలో, ఎక్కడో పొరుగు రాష్ట్రం, పైగా ఆ సొంత రాష్ట్రంలో వారికే లేని నొప్పి మనకెందుకు అని అనుకోకుండా, పొరుగు రాష్ట్రం అయితే ఏంటి మన తోబుట్టువు అని ఆలోచించి మద్ధతు తెలుపుతున్న ఈ మహిళా శక్తి యువనేత మరెవరో కాదు స్వయానా తెలంగాణా రాష్ట్ర సమితి ఆద్యక్షుడు, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ముద్దుల తనయ తెలంగాణా జాగ్రుతి ఆద్యక్షురాలు టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత.
ఆంధ్రప్రదేశ్ ఎంపీల డిమాండ్‌లో న్యాయముందని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పార్లిమెంట్ సమావేశంలో పేర్కొన్నారు. గురువారం జరిగిన లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ… ‘‘భాగస్వామ్య పక్షమే ఆందోళనకు దిగడంవల్ల దేశ ప్రజలకు భిన్నమైన సంకేతాలు వెళతాయి అని దీని వల్ల మున్ముందు పరిణామాలు తీవ్రతరం అవుతాయి అని అన్నారు. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. విభజన హామీలను నెరవేర్చాలని కోరడంలో న్యాయముంది’’ అని కవిత అన్నారు. తన ప్రసంగం సమయంలో నినాదాలు చేయకుండా సహకరించిన టీడీపీ ఎంపీలకు ధన్యవాదాలు చెబుతూ… ‘జై ఆంధ్రా’ అంటూ ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.
ఒకనాడు ఊమ్మడి రాష్ట్రంగా వెలుగొన్దిన ఆంధ్ర, తెలంగాణా నేడు ప్రథ్యేక తెలుగు రాష్ట్రాలుగ విడిపోయి ముందుకు సాగుతున్నాయి. విభజన ఛట్ట ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ కు రావలసిన నిధులు, ప్రత్యేక హోదా, మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యినదనె వాదన బలంగా నిరసనల రూపంలో వ్యక్తమవుతున్న నేపద్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను శాంత పరచడానికి టిడిపి ఎమ్మెల్యలు, ఎంపిలు ఇటు రాష్ట్రంలోను, అతు పార్లిమెంట్లోను తమ నిరసనల గళం విప్పారు.
యూపి ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలను అడ్డదగోలుగా విభజించిందనేది తెలిసిన విషయమే. ఆందులో తెలంగాణ కంటే ఆంధ్రకు ఎక్కువ అన్యాయం జరిగింది. ఆయినా కూడా ప్రదాని మోడి ఇచ్చిన హామితో ఊరకుండిపోయారు. ఆంధ్ర, తెలంగాణాలు రెందు రాష్త్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్ళా కలిసి వుండాలని నిర్ణయించుకున్నారు. విభజన జరిగి ఇన్నాళ్ళయినా ఆ హామిలేవి నెరవేర్చకపోవడంతో, మరో పక్క ప్రతి పక్షం అండగా లేకపోగా తలపెట్టిన పనులకు అడ్డుపడుతుండదం మింగుడు పడని విషయం.
ఇప్పటివరకు వేచి చూసిన ఆంధ్ర ఫ్రజలు ఝనసేన నేత, ఆ పార్టీ ఆద్యక్షుడు పవన్ కల్యాణ్ భరోసాతోను, ఆంధ్ర జెఏసి బంధ్ పిలుపుతో నిరసనలతోను ఉద్యమ్మన్ని లేవదీసారు. తెలుగు ప్రజల నిరసన సెగలు, జ్వాలలు కేంద్ర ప్రభుత్వానికి తగలక ముందే మేల్కొంటే మంచిదని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. దీనిలో భాగంగా ఆంధ్ర ఎంపిలు లోక్‌సభలో అందోళలను చేపట్టారు. ఇప్పుడు వారికి మద్ధతుగా టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా జతయ్యారు.