Tholiprema Movie Review

వ‌రుణ్ తేజ్‌ తొలిప్రేమ‌ మూవీ రివ్యూ

Tholiprema Movie Review

తారాగ‌ణం: వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా, సుహాసిని మణిరత్నం, సప్న ప‌బ్బి, ప్రియ‌ద‌ర్శి పులికొండ, హైప‌ర్ ఆది, విద్యుల్లేఖా రామన్ త‌దిత‌రులు
కూర్పు: న‌వీన్ నూలి
సంగీతం: ఎస్‌.త‌మ‌న్‌
ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియ‌మ్స్‌
నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌
నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌
క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వెంకీ అట్లూరి
విడుదల తేది: 10.02.2018.
కాల వ్యవధి: 2 గం. 15 నిము.

రేటింగ్‌: 4.00/5*

Varuntej Tholiprema Review

తొలిప్రేమ‌ మూవీ రివ్యూ

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన వారసత్వ హీరోనే అయినా వ‌రుణ్ తేజ్ త‌న కెరీర్ ప్రారంభం నుండి వైవిద్యభరితమైన సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే వచ్చిన ‘కంచె’ చిత్రంతో ప్రేక్ష‌కుల అభిమానంతో పాటు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకున్నాడు వ‌రుణ్ తేజ్‌. ఈ మెగా యువ క‌థానాయ‌కుడికి గ‌త ఏడాది ‘ఫిదా’ రూపంలో పెద్ద విజయాన్ని ఏ సినిమా దక్కించుకుంది. ‘ఫిదా’ సినిమా తన గత చిత్రల వసూల్లను అదిగమించి తన కెరీర్లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. ఈ ఏడాది ప్రేమికుల రోజు దినోత్సవం స్పెషల్ గా ‘తొలిప్రేమ‌’ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు వ‌రుణ్‌. న్యూ ఏజ్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ ‘తొలిప్రేమ‌’ చిత్రం టైటిల్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి సినిమాపై అంద‌రిలోనూ భారీగా ఆసక్తి నెలకొంది. అందుకు కార‌ణం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వ‌రుణ్ తేజ్‌ బాబాయ్ అయిన పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కెరీర్నే అథి పెద్ద బ్రేక్ ఇచ్చిన మూవీ తొలిప్రేమ, ఇప్పుదు ఆ టైటిల్‌తో అబ్బాయి వ‌రుణ్ తేజ్‌ వ‌స్తుండ‌ట‌మే. అలాంటి టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన వ‌రుణ్ తేజ్‌కి ఈ ‘తొలిప్రేమ‌’ చిత్రం ఎలాంటి విజ‌యాన్నిచ్చిందో తెలుసుకుందాం.

Varun Tej Tholi Prema Movie Review

క‌థ‌:
ఆదిత్య (వరుణ్ తేజ్‌) కాలేజ్ టాప‌ర్‌.. తాను చేసె ఏ పనైనా క‌రెక్ట్‌గాన ఆలోచించి చేస్తాను. అందులో ఏ త‌ప్పు ఉండ‌దు అనుకునే యువ‌కుడు. ఇలాంటి మ‌న‌స్థత్వం ఉన్న ఆదిత్యకు ఓ ట్రెయిన్ జ‌ర్నీలో వ‌ర్ష (రాశీ ఖ‌న్నా)ఎదురుపడుతుంది. తొలిచూపులోనే వ‌ర్షను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు ఆదిత్య . తన ప్రేమ‌ను దాచుకోకుండా ఆమెకు తన మనసులోని మాటను చెప్పేస్తాడు ఆదిత్య . ఇద్ద‌రు ఇంజ‌నీరింగ్ చదువు కోసం ఒకే కాలేజ్‌లో జాయిన్ అవుతారు. అతి కొద్ది కాలంలోనే ఆదిత్య ప్రేమ‌కు వ‌ర్ష గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తుంది. అయితే ప‌రిస్థితుల కార‌ణంగా వీరిద్ద‌రూ విడిపోతారు. ఆరేళ్ల త‌ర్వాత మళ్ళీ ఒక ప్రాజెక్ట్ పని మీద లండ‌న్‌లో ఒకే కంపెనీలో ఇద్ద‌రూ క‌లుస్తారు. అప్పుడు వారిద్దరి మధ్య జరిగిన మాన‌సిక సంఘ‌ర్షణ ఏంటి? ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లుసుకుంటారా? వీరి ప్రేమ ఏమౌతుంది? అనేదే క‌థ‌.

Tholiprema Review

నటనా విశ్లేష‌ణ‌:

ఫిదాలో ఎన్నారై యువ‌కుడిగా, ప‌రిణితితో కూడుకున్న పాత్ర‌లో క‌న‌ప‌డ్డ వ‌రుణ్ తేజ్ ఈ సినిమా ల‌వ‌ర్‌బోయ్ పాత్ర‌లో భిన్నంగా క‌న‌ప‌డ్డాడు. ప్రేమించుకోవదం, విడిపోవ‌డం అనే సంద‌ర్భాల్లో వ‌చ్చే బాధ‌ను.. వేరియేష‌న్స్‌ను త‌న క్యారెక్ట‌ర్‌లో వ‌రుణ్ చ‌క్క‌గా పరిణతితో చేశాడు. వ‌ర్ష పాత్ర‌లో రాశీ ఖ‌న్నా చ‌క్క‌గా నటించింది. పాత్ర కోసం స‌న్న‌బ‌డ‌టం.. కొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌టం పెద్ద ప్ల‌స్ అనే చెప్పాలి. రాశి ఖ‌న్నా త‌న కెరీర్‌లోనే బెస్ట్ రోల్ చేసింది. త‌న హావ‌భావాలు, కారులోని జరిగే రొమాంటిక్ సీన్ అన్నీ యూత్‌కి, సగటు ప్రేక్ష‌కుల‌కి బాగా క‌నెక్ట్ అవుతుంది. స‌ప్న ప‌బ్బి పాత్ర చిన్న‌దే అయినా ఉన్నంతలో మెప్పించింది. బ‌జ‌ర్‌ద‌స్త్‌ ఆది, సుహాసిని, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌తో మెప్పించారు.

Varun Tej Rashi Khanna Tholi Prema Movie Review

సాంకేతిక నిపుణత:

ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరికిది తొలి సినిమా ఇది. మంచి ఫీల్ గుడ్ వున్న ల‌వ్‌స్టోరీ. ప్రేమ క‌థ అంటే ప్రేమించుకోవదం, క‌లుసుకోవ‌డం.. విడిపోవ‌డం.. మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం అనే పాయింట్ కామ‌న్‌నే అయినా ఇలాంటి ప్రేమ‌ క‌థ‌ల్లో వుందే ఎమోష‌న్స్‌, ఫీల్ అనేది చాలా ముఖ్యం. ఈ సినిమాలో అవి మిస్ కాకుండా చూసుకున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. సినిమా ప్రారంభ‌మైన కాసేప‌టికే ప్రేక్ష‌కులు ఆ ఫీల్‌కి లోన‌వుతారు. ఫ‌స్టాఫ్ అంతా ఓ ఫీల్‌తో నడుస్తుందీ సినిమా. అయితే సెకండాఫ్ విష‌యానికి వచ్చేసరికి.. మాత్రం స‌న్నివేశాలు కొంచెం లాగిన‌ట్లు అనిపిస్తాయి. క్లైమాక్స్ ఎఫెక్టివ్‌గా ఉండాల‌నిపించింది. సెకండాఫ్ నెరేష‌న్ ఫ్లాట్‌గా అనిపించింది. అయితే సెకండాఫ్‌లో ప్రేమ‌కు సంబంధించిన కొన్ని డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. వెంకీ అట్లూరి క‌థకు త‌మ‌న్ త‌న సంగీతం, పాతలు, నేప‌థ్య సంగీతంతో బ‌లాన్ని చేకూర్చాడు. జార్జ్ సి.విలియ‌మ్స్ ప్ర‌తి స‌న్నివేశాన్ని అందంగా తెర‌పై చిత్రీకరించాడు.

Varuntej Rashi Khanna Tholiprema Review

బ‌లాలు:

– న‌టీనటులు
– చాయాగ్రహణం
– సంగీతం, నేప‌థ్య సంగీతం
– ఫ‌స్టాఫ్‌
– క్లైమాక్స్‌

బ‌ల‌హీన‌త‌లు:

– సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ అంతగా లేదు
– కామెడీ పెద్ద‌గా లేక‌పోవ‌డం

 

తీర్పు:

చివ‌ర‌గా… రెండు భిన్న వ్య‌క్తిత్వాల ప్రేమప్ర‌యాణమే.. ‘తొలిప్రేమ‌’. తప్పక చూడవలసిన చిత్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *