
జూ.యన్టీఆర్-త్రివిక్రమ్ వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరు నటనలో విశ్వరూపం చూపిస్తే, ఇంకొకరు తన దర్శకత్వ ప్రతిభతో, మాటల చతురతతో ఇంద్రజాలం చేసి కట్టి పడేస్తారు. ఇప్పుడూ వీరిద్దరి కాంబినేషన్లో రానున్న చిత్రానికి చేప్పలేనంత క్రేజ్ వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నా సాద్యా, అసాద్యాల గురించే పెద్ద చర్చ జరుగుతోంది. జూ.యన్టీఆర్-త్రివిక్రమ్ వీరిద్దరూ కూడా సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజి పడని వారు. ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని అనుకున్న సమయంలో అందిచాలని తపనపడుతుటారు.
ఈ రోజుల్లో ఏ సినిమా అయినా సెట్స్ మీదకు వెళ్ళడం.. షూటింగ్ పూర్తి చేసుకోవడం అంత పెద్ద విషయమేం కాదు. అందులోనూ క్రేజీ కాంబినషన్లో తెరకెక్కే సినిమాకయితే అది అసలు పెద్ద సమస్యే కాదు. ఎటొచ్చీ ఆ సినిమా పూర్తి చేసుకుని విడుదల చేయాలంటెనే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పైగా త్వరలో యన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయె ఈ సినిమాకయితే.. విడుదల తేదీ విషయంలో ఖచ్చితంగా క్లారిటీ వుండి తీరాలి. ఇప్పుడీ సినిమా విషయంలో ఇదే కొరవడుతోందన్నది లేటెస్ట్ న్యూస్.
జూ.యన్టీఆర్- త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కనున్న ఈ నూతన చిత్రం ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఏప్రిల్ నుంచి నాన్‌స్టాప్‌గా ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. అయితే ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలన్నది జూ.యన్టీఆర్, త్రివిక్రమ్ల ప్లాన్. వచ్చే నెల నుంచి మరో ఐదు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయడం పెద్ద విషయమేం కాదు. కాకపోతే ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి.. ఈ సినిమా దసరాకు వస్తుందనే విషయాన్ని ఎవరూ నమ్మలేక పోతున్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వం అంటేనే చాలా నిదానంగా సాగుతుంది. షూటింగ్ అంతా పూర్తయినా.. ఆర్, ఆర్ దగ్గర, ఎడిటింగ్ దగ్గర చాలా కేర్ తీసుకుంటూ పనులు పూర్తి చేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు టైం తీసుకోవడం త్రివిక్రమ్‌కి అలవాటు. అందుకే, 5 నెలల్లో ఈ సినిమా పూర్తవ్వడం అంటే కష్టసాద్యమే అని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు. పైగా వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి.. అనుకున్న షెడ్యూల్లన్ని అనుకున్న టైమ్‌కి చిత్రీకరణ పూర్తి చేయడం కష్టమే కాబట్టి.. ఎంత స్పీడ్‌గా త్రివిక్రమ్ సినిమాని పూర్తిచేసినా.. దసరాకు చిత్రాన్ని సిద్దం చేస్తే విడుదల చేయడం కష్టమే అంటున్నారు. అలా అయితే దసరా టార్గెట్‌ను రీచ్ అవడం కష్టమే అంటున్నారు. మరి ఈ సినిమా దసరాకి పూర్తి అవుతుందో లేదో చూడాలి.
అను ఎమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో జూ.యన్టీఆర్ సరసన హీరొయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. హారిక హసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్ రాధక్రిష్ణ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.