
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధే కీలక మంత్రంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర అభివృద్ధి పధం వైపు అడుగులు వేస్తున్నారు. ఇటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అటు తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశెఖర్ రావు ఇరువురు తెలుగు ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధికై పాటు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, భొగాపురం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఆమరావతి, గన్నవరం, నెల్లూరు, మంగళగిరి, కర్నూల్, అనంథపురం, రేణిగుంటలలో విమానాశ్రాయాల ఏర్పాటుకు, అభివృద్దికి ప్రయత్నాలు జురుగుతున్నాయి. ఇప్పటికే కడపలోని విమానాశ్రాయంలో కార్య కలాపాలు ప్రారంభమయ్యాయి. కడప నుండి విజయవాడకు రాక పోకలు సాగుతున్నాయి.
ఒక పక్క ఆంధ్ర రాష్ట్రంలోని పాడుపడిన విమానాశ్రయాల పునదుద్దీకరణ జరుగుతుంటే, ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం కూడా ఆ వైపు వడి వడిగా అడుగులు వేస్తోంది. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు రంగం సిద్దమైంది. దీనితో తెలంగాణాలో మరిన్ని విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్, ఆదిలాబాద్, నిజామబాద్, కొత్తగూడెం విమానాశ్రయాలను పునరుద్దీకరణకు ప్రయత్నిస్తున్నట్టు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (టిఎస్‌ఎఎ) సిఇఒ కెప్టెన్ ఎస్‌ఎన్ రెడ్డి తెలిపారు.
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ఎర్పాటుతో వరంగల్ నుంచి విమాన ప్రయాణాలతోపాటు సరుకుల రవాణాకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. దీని ద్రుష్ట్యా ఓరుగల్లులోని విమానాశ్రయాన్ని అభివృద్ధికి చేయటానికి ప్రయత్నిస్తున్నామని, దీనిపై చర్చించేందుకు ఈ నెల 12 తర్వాత రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌తో సమావేశమవుతున్నట్టు టిఎ్‌సఎఎ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు పిఆర్ ప్రసాద రావు చెప్పారు.
ప్రస్తుతం వరంగల్ నగరంలో వున్న విమానాశ్రయంలో 6,000 అడుగుల పొడవైన రెండు రన్‌వేలు ఉన్నాయి. వీటిని పునదుద్దీకరించి కార్య కలాపాలు ప్రారంభిస్తామని, బేగంపేట విమానాశ్రయంలో రద్దీ పెరిగి పోవడంతో వరంగల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి అక్కడే పైలెట్ల శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఉన్నట్టు ప్రసాద్ చెప్పారు.
వరంగల్ నగరంతో పాటుగా ఆదిలాబాద్, నిజామబాద్, కొత్తగూడెంపట్టణ ప్రాంతాలలో కూడా విమానాశ్రయాల పునదుద్దీకరణకు, అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.