Indian Actress Sridevi passed away

తెలుగు వారి అతిలోక సుందరి, వసంత కోకిల శ్రీదేవి ఇక లేరు. దుబాయి లో జరుగుతన్న ఒక వివాహ వేడుక కోసమని వెళ్ళిన ఆమె నిన్న అర్ద రాత్రి బస చేస్తున్న హోటల్లో హార్ట్ ఎటాక్ తో మరణించారు. శ్రీదేవికి తోడుగా ఆమెతో పాటు ఆమె భర్త బోణీ కపూర్ మరియు ఆమె చిన్న కుమార్తె ఖుషీ వున్నారు. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి ‘ధడక్’ సినిమా కోసం షూటింగ్ కోసమని ఇండియాలోనే వుండిపోవలసి వచ్చింది. శ్రీదేవి తన పెద్ద కుమార్తె జాన్వి ని వెండి తెరకు గొప్పగా పరిచయం చేయాలని అనుకుంటున్న తరుణంలో ఈ హటాత్ పరిణామంతో యావత్ సినీలోకం దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఇంగ్లిష్- వింగ్లిష్ చిత్రంతో తిరిగి ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం శ్రీదేవి ‘మామ్ ‘ అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఆమె వయస్సు 54 సంవత్సరాలు.

అందాల అతిలోక సుందరి శ్రీదేవి ఈ పేరు తెలియని తెలుగువారు కాని, భారత దేశ చలన చిత్ర పరిశ్రమ కాని వుండదు అంటే అతిశయోక్తి కాదు.. తమిళనాట జన్మించి బాల నటిగా తన సినీ ప్రస్తానం మొదలుపెట్టి, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం వంటి దక్షిణాది భాషలే కాకుండా హింది చలన చిత్ర పరిశ్రమలో కూద తనకంటూ ఒక చెరగని ముద్ర వేసి, సుస్థిర ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విలక్షణమైన ఉత్తమ నటి శ్రీదేవి. నటనలో తనకు తానే సాటి అనిపించుకొని అలనాటి అగ్ర నటీమణులు అయిన సావిత్రి, జమున, జయలలిత, కాంచన, జయప్రద, జయసుధ, షబానా ఆజ్మి, హేమ మాలిని,రేఖ లకు దీటుగా, మాధురి దీక్షిత్, కరిష్మా కపూర్, జూహీ చావ్లా, టబూ, ఐశ్వర్య రాయ్, కాజొల్, శిల్పా శెట్టి, రవీనా టాండన్ లను మించి ప్రతిభ కనబరచిన నటి శ్రీదేవి.

యన్.టి.ఆర్, ఏ.యన్.ఆర్, క్రిష్ణ, ఆమితాబ్ బచ్చన్, శివాజి గణేశన్ మొదలు రజినికాంత్, చిరంజీవి, కమల్ హాసన్, బాలక్రిష్ణ, నాగర్జున, వెంకటేష్, మోహన్ బాబు, అనిల్ కపూర్, రిషి కపూర్, జితేంద్ర, మిథున్ చక్రవర్తి, సంజయ్ దత్, చంద్ర మోహన్, శోభన్ బాబు, క్రిష్ణం రాజు, మురళీ మోహన్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి మేటి అగ్ర నటుల సరసన నటించిన నటీమణి శ్రీదేవి. ఫ్రముఖ దర్శకులు కె. రాఘవెంద్ర రావు మరియు రాం గోపాల్ వర్మ లకు అతి ప్రియమైన, తమ ఆరాద్య నటి శ్రీదేవి.

భారతీయ చలన చిత్ర పరిశ్రమలోని అన్ని ముఖ్య బాషల్లో అగ్ర నటిగా వెలుగొందిన ఘనత శ్రీదేవికే దక్కుతుంది. పద్మశ్రీ అవార్దుతో పాటుగా, జాతీయ అవార్దు, ఫిల్మ్ ఫేర్ అవార్దు, రాష్ట్ర నంది అవార్దుతో పాటు, మరెన్నో పురస్కారాలను పొందిన ఘనత ఆమె సొంతం. నటి శ్రీదేవి ఇకలేరనే వార్థ తెలిసి తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో పాటు, యావత్ సినీ ప్రపంచం ఆమెకు తమ ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తూ విచారాని వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మీ అందరితో పాటుగా ‘అమరావతి న్యూస్ టైమ్స్’ టీం ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *